కలల
సరసన తూగవలసిన రేయిలో
నిదుర
నా దరి చేరనన్నది ఏలనో ॥
మూగమనసున
గొంతు విప్పే తలపులు
బ్రతుకు
బాటన ఊహకందని మలుపులు
కలత
రేపినవెవరివో ఈ పిలుపులు
నిశ్శబ్దంగా
తట్టినవి ఎద తలుపులు
కనులు కాయగ ఎదురుచూపులు చూసినా ॥నిదుర॥
చిగురుటాకులు
సడులు సద్దే మణిగెనే
గాలి
సైతం కొండ చాటున సోలెనే
మబ్బు
మాటున చందురుడు మైమరచెనే
మౌనమే
లోకాన రాజ్యాలేలెనే
జోలపాడుతు తల్లులే తలవాల్చినా ॥నిదుర॥
No comments:
Post a Comment