మనసు
మౌనంగా పిలిచింది నిన్నే
వయసు
మురిపెంగా వలచింది నిన్నే
కనుల
కనిపిస్తావు నన్ను కవ్విస్తావు
కలం
కదిపిస్తావు కవిత పలికిస్తావు
రాత్రి
నిదురైనా రాకుండా నువ్వే
తలపు
తోటల్లో విహరిస్తుంటావు ॥
కలలు
పండేదెలా కోర్కె తీరేదెలా
దవ్వు
తరిగేదెలా నిన్ను చేరేదెలా
వేచి
ఉన్నాను రావోయి రాజా
కానుకిస్తాలే
నా వలపు రోజా ॥
No comments:
Post a Comment