Wednesday, 28 June 2017

47. నాగరికతా నీ పయనం ఎటు



చదివిన చదువులు తేవు కొలువులు
యోగ్యుల కోసం లేవు పదవులు
పేదవాడి దుఃఖం చేటు పెదవికి
గండి అయినా లేదు వాడి కడుపుకు
మరో నిరుద్యోగి దారి గోదారికి మళ్ళింది
ఔను నాగరికత పెరిగింది

వానలు పడవు భూమి తడవదు
పండటు పండవు పూట గడవదు
పేద రైతులకు నెత్తిన అఫ్పులు
చావే తీర్చాలి వారి తిప్పలు
నేలలో తడి వీరి కంట్లో కనిపించింది
ఔను, నాగరికత పెరిగింది

భూమి కంపించి ఇళ్ళు కూల్చింది
ప్రకృతి ప్రళయరూపం దాల్చింది
పిడికెడు కడుపే శత్రువు వారికి
ఎవరూ నిలవలేరు విధి బారికి
ఇందులో సైతం విదేశీ హస్తం తేలింది
ఔను, నాగరికత పెరిగింది

బాంబులు పేల్చి మనుషులను చంపుట
నగరాల్లో నేడు ఇదో కొత్త ఆట
మారణ హోమం కాదట- దీపావళి వేడుక
పాడె అఖ్కడి వారికి రోజూ వాడుక
ఎండి క్ళలలో రక్తం కారింది
ఔను, నాగరికత పెరిగింది

రైతు చేతులకు వద్దట నాగలి
అన్నపూర్ణలో సమస్య ఆకలి
నేటి సాగుభూములే రేపటి ఇళ్ళు
ప్రతి వారి పిల్లలకు కావాలి కాన్వెంటు బళ్ళు
చదువుకోని తండ్రికి సంతానం పాఠాలు నేర్పింది
ఔను, నాగరికత పెరిగింది

రక్షక భటులే రాక్షసబంట్లు
డాక్టర్లంతా యముడి సర్వెంట్లు
న్యాయం గుడ్డిది కుంటిది ధర్మం
రొక్కం మూలం లోకం సర్వం
భూమాత ఎందుకో ఓర్పు అప్పు కోరింది
ఔను, నాగరికత పెరిగింది

రోగం వస్తే డాక్టరు చూచుట
మందిచ్చి తీర్చుట కలలోని మాట
వైద్యశాలలే నరకకూపాలు
కాటికి మార్గం చూపే దీపాలు
అదిగో, ఓ కిడ్నీ ఫ్రిజ్జులోకి దూరింది
ఔను, నాగరికత పెరిగింది

ప్రసవించిదొక భార్యకాని తల్లి
అనాథ అయిందో పసికందు మళ్ళీ
కర్ణుడి కోసం రాధలు లేరిక
శకుంతల కోసం కణ్వులు రారిక
త్యాగానికి నిఘంటువు కొత్త అర్థం వెతికింది
ఔను, నాగరికత పెరిగింది

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...