Wednesday, 28 June 2017

40. నల్లనయ్యా నువ్వు లేక



వేగరారా నీకోసం వేచి ఉన్నది బృందావనం
నల్లనయ్యా నువ్వు లేక గోకులమంతా చినబోయే

వెన్నతింటూ నువ్వు విరిచిన ఉట్టి కడవలు గుర్తున్నాయా
వాటి వలెనే మా మనసులు ముక్కలైపోయాయి కృష్ణా
ఎటు చూసినా నీ రూపమే ఏం చేసినా నీ ధ్యానమే
నిను వీడి ఉండలేక బ్రతుకే బరువాయే కాదా

లేగదూడలు తల్లి ఆవుల పాలు తాగగ కదలవాయే
వాటి వీనులు వేణునాదం గ్రోలగ నీ దారి చూసే
నువ్వు లేవని ఆమని కూడా ఈ నేలను తాకరానంది
చెట్లు తీగలు ఆకులు పూలు విరహంతో వాడిపోయే

నిను తలచీ వేచి వేచి కనులన్నీ కాయలు గాచి
వాటి నిండా నువ్వు పంపిన కలలే కల్లలైపోగా
ప్రాణమున్నా జీవం లేని రాతిబొమ్మై పడి న్నది
నీ ఉనికే అణువణువూ నింపుకున్న వెర్రి రాధ

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...