Wednesday, 28 June 2017

16. వేచి చూడు నేస్తమా



ఓటమి కాదిది గెలుపు బాటలో సోపానం
చీకటి కాదిది వెలుగు దారిలో అవస్థానం

తూర్పు కొండ వెనకే దాగాడు సూరీడు
రేయి గడిచి పోగానే తప్పక వస్తాడు
చీకటి చెర తొలగించి వెలుగులను తెస్తాడు
          వేచి చూడు నేస్తమా వేకువ కోసం
          రేయికి తోడుంచుకో ఓ చిరుదీపం

కాని కాలమే నిలిచి పోదులే కలకాలం
ఆశ జారితే సడలిపోతుంది గుండెబలం
ఆగితే మరిక సాగబోదుగా నీ పయనం
          గమ్యమింక లేదులే ఎంతో దూరం
          కెరటాలకు భయపడితే చేరవు తీరం

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...