Wednesday, 28 June 2017

1. ఎదురుచూపు



వెన్నెలమ్మ విరిసే వేళ
చంద్రకాంతి కురిసేవేళ
చల్లగాలి తనువును తాకి,
తాపమింక పెంచేవేళ
          నీవు రావు ఎందుకో ప్రియా
          జ్ఞాపకాలు పంపుతావిలా

చుక్కలన్ని నన్ను చూసి
చిలిపిగా నవ్వుతుంటే
చీకటింక చిక్కనయ్యి
అల్లరిగా చూస్తూ ఉంటే
          తాళలేను విరహవేదన
          ఓపలేను ఈ నిరీక్షణ

రేయి సగం గడిచిపోయినా
చందమామ అలసిపోయినా
సవ్వడంత ఆగిపోయి
నిశ్శబ్దం అలుముకున్నా
          నిదురరాదు రాత్రివేళల
          కలలనైనా కానరావేలా

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...