Wednesday, 28 June 2017

71. వెతికాను వేకువ కోసం



వేచాను వేకువ కోసం వెతికాను వెలుగుల కోసం
ఈ కారు చీకటి మింగిన ఆ సూర్యుడి కిరణం కోసం
ఈ రేయి కోరల్లో పడి నలుగుతున్న వెలుతురు కోసం
పడమటి కొండెత్తుకుపోయిన ఆ తూరుపు దీపం కోసం
రాతిరితో అవిరామంగా పోరాడే తపనుడి కోసం
అంధకార వలలో చిక్కిన ఆ వెలుగుల వీరుడి కోసం
ఈ నల్లని ముసుగును చీల్చే ఆ గుండ్రని బింబం కోసం
కాంతులతో తమసు హరించే ఆ మిత్రుని విజయం కోసం
ఈ నిశలను అంతం చేసే ఆ వేకువ ఉదయం కోసం

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...