చీకటికి
భయపడితే సాగదు పయనం
నింగిన
నక్షత్రాలే రేయికి నయనం ॥
ఒకసారి
ఫలించలేదని ప్రయత్నం మానివేయకు
అనుకున్నది
జరగలేదని నీ సాధన ఆపివేయకు
కృషితో
కానిది లేదేదీ తెలుసుకో నిజం
గమ్యం
మార్గాన్ని వీడకు నీదే విజయం॥
ఓటమి
వైఫల్యమనుకుని మనసు జారకు
గెలుపుకదే
తొలి సోపానం ఆశ వీడకకు
ఏదారీ
దొరకలేదని దిగులు చెందకు
కొత్తదారి
నీవే వెయ్యి వెలుగు చెంతకు॥
ఒక
తీరుగ గడవదెప్పుడూ కాలమన్నది
రెండు
వైపులా చూడదగ్గది నాణెమన్నది
పరీక్షా
సమయంలోనే ఉంచు నిబ్బరం
భయం
వలదు నేస్తమా జయం నిశ్చయం॥
No comments:
Post a Comment