Wednesday, 28 June 2017

15. విమానం



ఓ విమానమా, ఎందాకా నీ పయనం?

ఆకాశంలో మబ్బుల తోనే కబుర్లు చెప్తావు
గాలిని మించే వేగంతో నువ్వు దూసుకుపోతావు
నదులు, అడవులు, సముద్రాలు నీకేవీ అడ్డం రావు
రెక్కల ఎగిరే పక్షుల చూసి వెక్కిరిస్తావు

జాబిలి తెమ్మని చందమామతో చెప్తావా నేస్తం
వెన్నెలనడిగి గోగుపూలను తెస్తావా నేస్తం
చుక్కలపైన చక్కనైన రాకుమారుడుంటాడు
నాతో ఆడుకునేందుకు రమ్మని చెప్తావా నేస్తం?

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...