Wednesday, 28 June 2017

41. గమ్యమింకా దూరమెంతో తెలియదు



గమ్యమింకా దూరమెంతో తెలియదు
దిగులు వీడి దారి వెంబడి ఆగకుండా సాగుతున్నా

తెల్లవారక పోదులే ఈ రేయి గడవకపోదులే
అని కళ్ళలోగిలి తలుపుమాటున వెలుగు రేఖను భద్రపరచి
గుండెగూటిన చిన్ని దీపపు కాంతితో
క్షణక్షణానికి చిక్కనయ్యే చీకటిని పోరాడుతూ
          దిగులు వీడి దారి వెంబడి ఆగకుండా సాగుతున్నా
          వేకువింకా దూరమెంతో తెలియదు

ఒడ్డు అందకపోదులే ఎదురీత ముగియక పోదులే
అని మనసు నిండిన ఆశయాలను తెడ్లుగా ఎదురీదుకుంటూ
కలల పడవను నడుపుకుంటూ మెల్లగా
అలల వలలో చిక్కకుండా కడలితో పోరాడుతూ
          దిగులు వీడి పయనమంతా ఆగకుండా సాగుతున్నా
          తీరమింకా దూరమెంతో తెలియదు

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...