Wednesday, 28 June 2017

63. అమ్మ

ప్రతిమనిషికి చేరువగా తనే నిలవలేక
దేవుడు ఇచ్చాడు మనకు అమ్మ అనే కానుక

సృష్టిలోని ఓర్పంతా ఒక్కచోట చేర్చి
అంతులేని అనురాగం ఆకృతిగా కూర్చి
మాయని మార్దవమే ఊపిరిగా మార్చి
తరగని మమత్వమే ఉనికిగా అమర్చి
అమ్మను చేశాడు తనకు ప్రతిరూపంగా
ఈచీకటి లోకంలో వెలుగిచ్చే దీపంగా

వెచ్చని స్పర్శల్లో విరబూసే లాలన
చల్లని చూపుల్లో వర్షించే దీవెన
చెప్పకనే తెలుస్తుంది అమ్మకు మన వేదన
ఇలలోనే లేదు సుమా ఆ ప్రేమకు పొంతన
తననే మరచినా మరువదు మనను ఏక్షణం
ఎన్నటికీ తీర్చుకోలేనిది ఆ తల్లి ఋణం

జీవన పాఠాన్ని నేర్పే తొలి గురువు
కరుణకు లోకంలో అమ్మే తుది నెలవు
మమతల సిరులిచ్చే అమ్మ కల్పతరువు
వ్యథలను మరిపించే మంత్రం ఆమె తలపు
అణ్మ ప్రేమ పొందాలని ఆ దేవుడు సైతం
ఇలపై ఎత్తాడు కదా మనిషిగ అవతారం

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...