Wednesday, 28 June 2017

38. ఎంతో దూరం లేదు మిత్రమా నీ గమ్యం



ఎంతో దూరం లేదు మిత్రమా నీ గమ్యం
దారికి వెరచి ఆపబోకోయి నీ పయనం
జాగు సేయక లేచి వెంటనే కదుపు పదం
మధ్య దారిలో ఆగిపోరాదు బ్రతుకు రథం

గతం నూతిలో జారిన కాలం మళ్ళీ రాదు
రాలిన ఆకు చెట్టు కొమ్మకు తిరిగి అతకదు
గడిచిన క్షణాల కోసం వెనక్కు పరుగులెందుకు
దిగులును వెనకే వీడి నీవు ఇక సాగు ముందుకు

ప్రతి క్షణం నిను కలచి వేస్తుంది చేసిన తప్పు
పశ్చాత్తాపం గుండెను కాల్చే వేడి నిప్పు
బ్రతుకు బాటలో నేర్చిన పాఠం మరచిపోకుమా
అనుభవాల చిరు జ్ఞాపకాలతో సాగు నేస్తమా

కృషి చేయనిదే అంది రాదులే ఏ లక్ష్యమైనా
కొలిమిన కాలక మెరవబోదులే సువర్ణమైనా
కిందపడిన ప్రతిసారి బెదరక లేచి నిలబడు
ఒకే ఓటమికి పయనం ఆపడు వీరుడెన్నడూ
ఆపజాలదిక ఏ ఆటంకం నిన్ను ఎన్నడూ

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...