Wednesday, 28 June 2017

51. నరకకూపం



కాలసర్పం చూపనన్నది కనికరం

బ్రతుకు మాటే రేపుతున్నది కలవరం
నిబ్బరానికి పరీక్షేనా ప్రతీ నిముషం
తేనెకన్నా తీయనన్నది ఇక విషం

విధికి మనిషొక ఆటబొమ్మగ మారితే
గుండె కరిగి కంటనీరే కారులే
నిస్సహాయత నీడ ధైర్యం జారితే
పయనమంతా భయం గొలిపే దారులే

అలసిపోయిన బాటసారికి శ్వాస శాపం
గాలి తాకిడికారనున్నది ఆశదీపం
వికృతంగా చిత్రమైనది బ్రతుకు రూపం
ఆశ జారిన జీవితం నరకాల కూపం

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...