కొత్తగా
కనుల లోకాలలో వచ్చి నిలిచారెవ్వరో
మెత్తగా
మనసు తాళాలనే విప్పతలచారెవ్వరో ॥
నా
హృదయవీథిలో రేగింది కలకలం
ఈ
మధుర వేదనకు ఒక్కింత కలవరం
ఎన్నడూ
తెరవని అంతర కవాటం
గడియ
కదిపారెవ్వరో ॥
పరిచయం
లేని ఈ నిట్టూర్పు సవ్వడి
పరవశం
కలిగించు వింతైన అలజడి
గమ్యమే
ఎరుగని బ్రతుకుయానంలో
బాట
మలచారెవ్వరో ॥
ఎటువైపు
చూసినా నిజమైయే కలలే
ఆనంద
కడలిపై ఉప్పొంగు అలలే
అనురాగ
రాగాన గుండె లోగిలిలోకి
తోడు
పిలిచారెవ్వరో ॥
No comments:
Post a Comment