ఓ
చిన్ని కోయిల, రాగాల ఊయల
ఆమని
రాగానే తెలియచేయవా
నీ
తీయని గొంతుతో ఓ పాట పాడవా
ఆ
మధుమాసం రాక సూచనీయవా ॥
మామిడి
కొమ్మలే చిగురులు తొడిగితే
పూతలు
చెప్పవా ఆ సంగతి
మల్లియ
రెమ్మలే రెక్కలు విప్పితే
తావులు
చెప్పవా ఆ సంగతి
ఓ
మావి మామయా, ఓ మల్లె చేడియా
ఋతువుల
రాజు రాక తెలియజేయరా ॥
పూవుల
తేనె తాగి ఝుమ్మని ఆడుతూ
తుమ్మెద
చెప్పదా ఆ సంగతి
పచ్చని
కాంతుల కోకను చుట్టిన
ప్రకృతే
చెప్పదా ఆ సంగతి
ఓ
చిట్టి తుమ్మెదా, ఓ ప్రకృతి దేవతా
వసంతరాజు
రాక తెలియచెప్పరా ॥
No comments:
Post a Comment