మౌనరాగానివై
సాగిపోయేవులే
మధురగీతానివై
ఊగిపోయేవులే
మనసులో
తపనవై రగలగా
తనువులో
ఊపిరై కదలగా
నిదుర
పోయేదెలా నేస్తమా
తాళదీ
తాపమే స్నేహమా ॥
చీకటే
తోడుగా నాకు ఈ రేయిలో
చంద్రుడే
వెన్నెలే చేరువీ వేళలో
జాబిలే
పరిహసించిందిలే విరహమై
కనులలో కాంతివై వెలిగిపోయేవులే ॥
ఆటపట్టించెలే
చుక్కలే ఒక్కటై
ఊసులే
ఆడెనే గాలులే పాటలై
మేఘమే
కబురులందించెలే వానగా
గుండెలో ప్రాణమై నిండిపోయేవులే ॥
కవితవై
జాలువారేవులే కలములో
వలపువై
ఊరడించేవులే తలపులో
జ్ఞాపకం
సరసమాడేనులే కోరికై
శ్వాసలో ఆశవై నిలిచిపోయేవులే ॥
No comments:
Post a Comment