Wednesday, 28 June 2017

62. నేనే తోడు



ఆ నింగికి మబ్బులతోడు
ఈ నేలకు మొక్కల తోడు
ఆ రేయికి చుక్కల తోడు
తూర్పుకు సూరీడు తోడు
          తోడెవరూ లేని నాకు నేనే తోడు

సెలయేటికి తీరం తోడు
సంద్రానికి దీవుల తోడు
చీకటికి వెన్నెల తోడు
పూబాలకు తుమ్మెద తోడు
          తోడెవరూ లేని నాకు నేనే తోడు

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...