Wednesday, 28 June 2017

58. మానకు



మావి చిగురు తొడగలేదని
కోయిలలు పాట మానవు
కోయిలలు పాడలేదని
వసంతం రాకమానదు
వసంతం రాక మరచెనని
పూబోణులు విరియమానవు
విరులు విరియ విస్మరించెనని
చిరునవ్వులు కురియమానవు
కోరికలు తీరలేదని
జీవితాన ఆశలొదలకు
ఆశలు నెరవేరలేదని
జీవించుట మానివేయకు

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...