పదిలంగ
వెళ్ళిరా ఓ మల్లి కొమ్మా
నిన్నేలుకొనువాడు
వేచినాడమ్మా
పుట్టింటిదీపమా
పుత్తడి బొమ్మా
మెట్టింటికాంతివై
విలసిల్లవమ్మా
అమ్మ
దీవెనలంది శుభములను పొంది
సిరిలక్ష్మివై
అచట అలరారవమ్మా ॥
అత్తగారే
నీకు తల్లియై నిలచు
తండ్రి
వలె నీ మామగారు భాసిల్లు
నీ
ప్రేమతో వారి మదుల గెలువమ్మా
మహరాణివై
వెలగవో ముద్దుగుమ్మా
మంచి
నడవడికతో మసులుకో తల్లీ
కన్నవారికి
మంచి పేరు తేవాలి
ఆ
ఇంటి అనురాగ సంపదను పొంది
పుట్టింటి
వారినే మరువబోకమ్మా ॥
No comments:
Post a Comment