పాడుతూ
సాగింది సెలయేరు
నాట్యాలు
ఆడుతూ పొంగింది నీరు ॥
దారిలో
రాళ్ళెన్ని ఆపచూశాయో
బాటలో
అడ్డంకులెన్ని వచ్చాయో
అన్నిటిని
దాటుతూ సాగింది ఏరు
నన్నేది
ఆపదని నవ్వింది నీరు ॥
సెలయేటికాపాట
ఎవరు నేర్పారో
ఈ
దారి సాగమని ఎవరు చెప్పారో
తన
దారి తానే వేసింది ఏరు
నను
చూసి జీవించ నేర్వంది నీరు ॥
No comments:
Post a Comment