కదలనన్న
కలం కదిపి ఏ కవితలు వ్రాయను?
కంట
నిలవని కన్నీటిని ఏ గుండెన దాచను?
దాహమేసి
నీటికొరకు ఏటిదారి అడిగితే
ఎండమావి
దారి చెప్పి అటు పంపారెవ్వరో
ఎడారిలో
సెలయేటిని ఏ చోటన వెతకను?
వీడుతున్న
ప్రాణాలను ఎలా పట్టి నిలుపను?
సముద్రాన్ని
దాటాలని ఓడ కోసమెళితే
చిన్ని
పడవ సాయమిచ్చి దిమన్నారెవ్వరో
కబళించే
కెరటాలను పడవన ఏం గెలవను?
నా
ఆశల తీరాలను ఎప్పటికి చేరను?
వాస్తవాల
వేడి తగిలి కలలు కరిగిపోయే
గతం
ఉనికి జ్ఞాపకాల పరిధి దాటదాయే
దూరమైన
స్నేహాన్ని ఏ పేరున పిలవను?
ఒంటరిగా
ఈ జీవన పయనమెలా చేయను?
No comments:
Post a Comment