Wednesday, 28 June 2017

26. నాకై వచ్చావు



మనసు పూవులో ప్రేమ తావిని నింపావు
బ్రతుకు తోటలో తీపి ఆమని నింపావు
వేసవిలో చెట్టునీడలా, వేకువనే మొదటి వెలుగులా
చిరునవ్వుల సిరిజాబిలినే నాకై తెచ్చావు

పున్నమి వెన్నెల రాత్రులలో నీకై వేచాను
అమావాస్య నల్లటి రేయిన నీకై చూశాను
చకోరాల చిరువేదనలో, ఒంటరిగా ఈ విరహంలో
చీకటి కమ్మే తరుణంలో నిన్నే తలచాను
సూర్యుని తొలి కిరణకాంతివై నాకై వచ్చావు

నువ్వు నిండిన ఈ ఎద నీకే కానుకనిస్తాను
ఒక్క సైగ చాలు ప్రియతమా పరుగున వస్తాను
నాలోని ప్రాణం నువ్వే, మను కదిపే భావం నువ్వే
నువ్వు లేక రసమే లేని కావ్యాన్నౌతాను
నవరస ప్రియరాగం నీవై నాకై వచ్చావు

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...