దరికి
రాని నిదుర కోసం ఎదురు చూశాను
కరుణ
చూపని అతిథి కోసం వేచి చూశాను ॥
ఆదమరచి
జీవులన్ని సోలిపోయాయి
తల్లి
పంచన బిడ్డల తలలు వాలిపోయాయి
కనులమాటున
పలకరించిన
రంగురంగుల
కలలలోకపు
దారి
వెంబడి వారి తలపులు సాగిపోయాయి
రేయి
సంద్రం ఆశగా ఎదురీగిపోతూ ॥దరికి॥
కాటుకకు
వలె చీకటెంతో చిక్కనాయెను
కాలగమనం
నత్తకన్నా నెమ్మదాయెను
ఒక
క్షణం ఒక యుగముగా ప్రతి
నిముషమెంతో
బరువుగా
మనసు
వాకిట గతపు గాడ్పులు ఆగవాయెను
గుండె
గదిలో శ్వాస బుసగా కదులుతుంటే ॥
పెదవి
విప్పని నింగి పాడెను మౌనగీతం
అడుగు
కదపని నేల చేసె నిశ్బ్దనాట్యం
మారు
మోగిన దిక్కులన్నీ
హోరుమన్నవి
కలత రేపి
ఆ
మహా ప్రతిధ్వనికి నాలో కలకలం
చిన్నపాటి
సడికి సైతం ఉలికి పడుతూ ॥
No comments:
Post a Comment