నీ
వెచ్చని గుండెలో ఒక్కసారి చూసుకో
ఏ
తీయని వలపులో పరిమళించలే కదా ॥
ఈ
చల్లని రాత్రేమో నా కన్నుల చొరబడి
నిదురంతా
దోచుకెళ్ళి చీకటికందించగా
నల్లని
ఆ చీకటి చిరుగాలుల ప్రేయసి
చిగురాకుకు
కానుకిచ్చె నా కమ్మని నిదురను
ఏ ఆకుల సవ్వడో నిన్ను తాకలే కదా ॥
ఏ
మధుర క్షణాలలో మది మెదిలిన ఊహకు
మెత్తగ
నా మోవిపై చిరునగవులు విరిసెలే
గమ్మత్తుగ
ఆ నగవును తుమ్మెద దోచేసెనే
తేనియకై
ఆశతో మల్లెలకందించెలే
ఏ పూవుల నవ్వులో నిన్ను పిలవలే కదా ॥
No comments:
Post a Comment