కళ్ళలోగిలి
దాటిపోకే ఓ కలా
శిశిరఋతువున
రాలిపోయే ఆకులా
ఎంతదూరం
ఉన్నదో మరి వేకువ
తోడురావే
రేయిలో చిరుదివ్వెలా॥
ఎక్కడుందో
చేరవలసిన గమ్యము
కఠినమైనా
తప్పదే ఈ పయనము
అడవి
దారిది దిక్కుతోచని చీకటి
మబ్బు
చాటును వీడి రాదే వెన్నెల
తోవతెలియక తిప్పలయ్యే
వేళలో
గుండెగూటిన నిలిచిపోవే
గువ్వలా॥
కానరాదు
కంటి చూపుకు తీరము
రానురానూ
పెరుగుతోందా దూరము
పెనుతుఫానుకు
వణుకుతోందీ చిన్ని నావ
పర్వతాల్లా
ఎగిసినే అలపైఅల
కడలి తో కదనాలు సాగే
వేళలో
ధైర్యమై ఎద మోగవే
సిరిమువ్వలా॥
No comments:
Post a Comment