చినుకుల
పలుకులతో చెప్పింది నీ సందేశం
ఆకాశం
ఒడిలో తేలే ఆ శ్రావణ మేఘం ॥
కలవరమయ్యే
మదిలో కలలే వరమాయెలే
ఎదగదిలో
నీ విరహపు శెగలే ఝరులాయెలే
ఎగిసిపడే
నీ తలపుల అలలే సిరులాయెలే
వేదనలో
గుచ్చుకునే మళ్ళే విరులాయెలే
నీ
ఊహలతో పెంచింది నా గుండియ వేగం ॥
వేకువనే
తూరుపు పండే తొలి వెలుగువు నువ్వే
పున్నమి
వెన్నెల కురిపించే సిరి నీ చిరునవ్వే
ఒక
నీ జ్ఞాపకమే చీకటి బ్రతుకున చిరునవ్వే
సిరిసంపదలేవైనా
నీ స్నేహానికి సరి కావే
నాలో
నింపింది తీయని తీరని ఆవేగం ॥
No comments:
Post a Comment