నిర్దయగా
సాగిపోవు కాలానికి బానిసలం
ఈ
సమయాన్నాపలేము మన కోసం కలకాలం
నిరంతరం
సాగే ఈ జీవన పయనంలో
ఎన్నో
మజిలీలు దాటి ఈ మజిలీ చేరామ
గమ్యంచేరాలంటే
మజిలీ దరి ఆగలేము
ఎవరి
దారి వెంట వారు సాగిపోక మానలేము
ఈ
అనంత వాహినిలో దరి చేరే కొందరు
తీయని
అనుబంధంతో పెనవేసుకుపోతారు
ఎంత
పంచుకున్నా పెరిగే అనుబంధమిది
స్నేహితుల
సామీప్యం తరగని ఆనందనిధి ॥
మనసు
కోరుకుంటున్నది శాశ్వత సహవాసం
తనివి
తీరకున్నా మరి తప్పదు విడిపోవటం
చిరునవ్వున
మొదలయ్యే ఈ చిన్నారి స్నేహం
ఎప్పటికీ
మనస్సులో తీరని ఓ దాహం ॥
స్నేహదీప్తి
వెలిగించి విడిపోయే నేస్తమా
ఈ
చదువుల ఆలయాన కలిసిన ఓ మిత్రమా
లక్ష్యం
చేరే పథాన విజయం నీదవ్వాలి
అడ్డంకులు
సైతం గమ్యానికి మెట్లవుతుంటే
ధ్యేయం
నీ కృషితో మరి చేరువగా రావాలి ॥
శుభాకాంక్షలందుకోని
విడిపోయే ఈ వేళ
ఓ
కానుక అడుగుతాను ఇస్తావా మిత్రమా
మళ్ళీ
ఎపుడైనా మనం తిరిగి ఎదురు పడితే
నీ
పెదవిన చిరునవ్వును విరిపిస్తావు కదూ
పలకరించి
కుశలమడిగి మురిపిస్తావు కదూ
ఈ
జ్ఞాపకమే కానుకగా ఇస్తావా నేస్తం
మరపెరుగని
స్నేహం నాకిస్తావా నేస్తం? ॥
No comments:
Post a Comment