Wednesday, 28 June 2017

45. నీ దరి చేరనీ



పరువం కానుకగా తెచ్చింది ఆమని
తనువే కన్నులుగా వేచిందిట జవ్వని
మనసే కోయిలై పిలిచే నిను రమ్మని
మానస హృదయేశ్వరా నీ దరి చేరనీ

వెన్నెల విరిసింది ప్రియా వేచినాను నీకై
గాలితెరల తాకిడిలో వెదకినాను నీకై
ఈ చీకటి రాత్రుల్లో నీ చక్కని చిరునవ్వు
నా తలపుల ఆకసాన నెలజాబిలి పువ్వు
నీ కలల్లో తేలటమే ఇక్కడ నా పని
నీ తీరాన నిలపనీ వలపుల నావనీ
          మానస ప్రణయేశ్వరా నీ దరి చేరనీ ॥

కలలో కదిలేవు ప్రియా కలతరేపి నువ్వే
మెలుకువ వేళల్లో ప్రతి అలికిడిలో నువ్వే
సడివై ఉంటావు నా ఎద లోగిలిలో
లయవై కదిలేవే అనుక్షణం ఊపిరిలో
నిరతం హృదయంలో నీ పిలుపులు వినీ వినీ
నీవులేక నేనైనా నీరు విడిన చేపనీ
          మానస ప్రాణేశ్వరా నీ దరి చేరనీ ॥

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...