Wednesday, 28 June 2017

4. ఎందుకో



మల్లియమోవిపై విచ్చిన నగవుకు
మామిడి మనసులో కలవరమెందుకో
నింగిన నల్లని మబ్బుల పిలుపుకు
నెమలి పదాలలో కదలికలెందుకో

అరుణుని కిరణము తాకినతోడనే
మురిసిన కమలము విరిసెను ఎందుకో
వెన్నెల కురిసెడి చంద్రుని రాకతో
కలువల కళ్ళలో పరవశమెందుకో

తుమ్మెద ఝుమ్మని పెదవి స్పృశించగా
విరి చిందించెనే తేనియలెందుకో
దీపము వెలుగును కాంచిన వెంటనే
చెంతకు చేరెనే పతంగమెందుకో

కన్నియ చెంపల కెంపులు మెరియగా
కాంతుని గుండెలో కలకలమెందుకో
ఆతని చూపులు మెత్తగ తాకితే
ఆవిడ ఊహలో కువకువలెందుకో

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...