Wednesday, 28 June 2017

50. ప్రణయ సందేశం



ఆకాశ లోకాల అందంగ సాగే - మేఘాలతో పంపనా
ఆనంద తీరాల మైమరచి ఎగిరే - విహగాలతో పంపనా
నా ఎదను ఏలే రారాజుకై - ప్రణయాల సందేశం
నా మదిని శాసించు మారాజుకై - విరహాల సందేహం ॥

ఈసారి చెప్పాలి చిరుగాలికి.. నిను చూసి రమ్మని
సిరిమల్లిగంధాల నా కానుకను నీకు సరసంగ ఇమ్మని
ఒకసారి నిను తాకి ఆ స్పర్శ నాకై పదిలంగ తెమ్మని
ప్రియవరుని చెంతకే చేర్చిపో రాదా అందాల ఈ బొమ్మనీ ॥

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...