గెలవాలని
ఉంది ఒక ప్రేరణ కావాలి
బ్రతకాలని
ఉంది ఒక ఊపిరి కావాలి
ఈ జీవన పయనం ఒంటరిగా చెయలేను
గమ్యం చేరాలని
ఉంది ఒక తోడు కావాలి
చేతిన
ఉన్న కలం ఉబలాట పడుతోంది
కవిత
రాయాలని ఉంది ఒక భావం కావాలి
నింగిన ఒక చుక్క దరి చేరగ
రమ్మంది
పైకెదగాలని ఉంది ఒక చేతన
కావాలి
నా
ఆశల తీరాలు దూరాన ఉన్నాయి
కడలి
దాటాలని ఉంది ఒక నావ కావాలి
బాధల భారంతో బరువెక్కిన
మదిని
తేలిక పరచాలి ఒక చిర్నవు
కావాలి
No comments:
Post a Comment