Wednesday, 28 June 2017

39. నా పరిచయం



నీ కళ్ళలో కదిలే నవభావనే కాదా నా పరిచయం
నీ ఊపిరై సాగే ఆ జ్ఞాపకం కాదా నా పరిచయం

నీ ఒంటరి క్షణాల తోడున్న కలవరం నేను కాదా
నీ తుంటరి తలపులు రేపిన కలకలం నేను కాదా
నీ పెదవిపై కదిలే చిరుగీతమే కాదా నా పరిచయం

నీ నిద్రలో ఎద చేరువ హత్తుకునే తలగడ నేనే
ఏ నిశ్శబ్దం లోనుంచో వినిపించిన అలికిడి నేనే
నీ కన్ను లోగిలిలో కదిలే చిరుస్వప్నమే కాదా నా పరిచయం

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...