చిన్ని
చిన్ని చిలిపి కోరికలు తలుపులు తట్టాయి
చిగురు
తొడగి చిట్టి ఆశలు మనసును చుట్టాయి ॥
ఆకాశం
నా గుప్పిట్లో దాచుకోవాలని
చందమామ
నా దోసిట్లో ఒదిగిపోవాలని
కెరటాల
నిచ్చెననెక్కి చుక్కల చేరాలని
హరివిల్లు
ఊయల కట్టి ఆడుకోవాలని ॥
చిరుగాలిని
చిలుకలను చేసి పెంచుకోవాలని
చినుకుల
ముత్యాల హారం వేసుకోవాలని
సెలయేటి
గలగల పాటకు శైలి కట్టాలని
వెన్నెల
మల్లెలుగా కోసం జడలో ముడవాలని ॥
No comments:
Post a Comment