Wednesday, 28 June 2017

10. చిట్టిపాప కమ్మగా నిదురేగెనే



చీకటికి చిరుగాలి చెప్పే కథలు వింటూ
చిట్టిపాప కమ్మగా నిదురేగెనే

మబ్బు తునకల పరుపుమీద
జాబిలమ్మ జోల వింటూ
నింగి ఒడిలో చందమామ
వెచ్చగా ఒదిగాడు చూడు
చిగురుటాకూ, కదలకూ సడి చేయకు

రేయి తెచ్చెను ఎచటి నుంచో
మిణుకుమంటూ చుక్కలెన్నో
గుండె మాటున దాచుకున్నవి
వెండి బంగరు కలల రాసులు
చిన్న కన్నుల చిరు కలను పండించవే

ఆకసం ఆనందమీయగ
మల్లెపూవుల సిరులనీయగ
చుక్కలే చిరునగవులీయగ
చెక్కిలే విరసింది తీయగ
చల్లగాలి ప్రేమగా దీవించవే

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...