Wednesday, 28 June 2017

29. విరిసిన పువ్వు



ఎదలో వలపే విరిసింది పూబాలగా
మదిలో తలపే వీచింది చిరుగాలిగా
వింతగా ఉందీ అనుభూతి
వయసే మారింది ఈ రీతి

కన్నుల కలలే తొలి ఆశల వినువీథిలో ఎగిరే విహగాలై
వెన్నెల అలలే ఈ బాలిక తను తీరాలను తాకెను పరువాలై
మెత్తగ హత్తుకునే వెచ్చటి యవ్వనం
కొత్తగ విచ్చుకునే కోర్కెల నిలయం
జాబిలి నవ్వింది నను చూసి జాలిగా

తూరుపు కిరణాల సిరి వెలుగుల కన్నులలో మెరుపులు మెరిసింది
తీయనిప్రణయం నును లేత బుగ్గలపై ఎరుపై నిండింది
నిదురను దోచింది నల్లని రేయి
అయినా తోచింది ఏదో హాయి
మనసే పాడింది వేదన రాగాలుగా

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...