జీవమే
తీరని దాహం - ప్రపంచమే ఎడారిమయం
అందుకే
శోధన వ్యర్థం
మరలిపో
నేస్తమా చూడకు స్వప్నం
మరచిపో
మిత్రమా ఆశయతీరం
ఏ
వస్తువు వెతకచూసినా దొరకదిక్కడ
ఎదురు
చూపులెన్నేళ్ళైనా తరగవిక్కడ
వెతుకులాటకర్థం
లేదు - ఈ పయనానికంతం లేదు
అందుకే
నిరాశ తీరదు
బాధపడకు
నేస్తమా ఇంతే లోకం
దిగులు పడకు మిత్రమా అంతా
మైకం
No comments:
Post a Comment