నిదుర
రాదు రేయి గడిచిపోతున్నా
ఎదురుచూసి
నిరాశతో సొలసిపోవు చిన్నారికి ॥
వేళ్ళమధ్య
కొంగు చివర చుడుతూ
కోపంగా
బుంగమూతి పెడుతూ
గడియారం
ముల్లు వంక రుసారుసాచూస్తూ
బురువెక్కే
శ్వాసలతో నిట్టూర్చే అమ్మాయికి ॥
చిన్న
సడికి ఉలికి ఉలికి పడుతూ
తల
ఎత్తి తలుపువంక చూస్తూ
చిరుగాలికి
కదులుతున్న చిగురాకును కసురుతూ
నిరీక్షణకు
నీరసించి వాడిపోవు అమ్మడికి ॥
అతని
తలపు కలత రేపుతుంటే
మనసున
తను అల్లరి పెడుతుంటే
వెచ్చని
ఊపిరి తనువును వేడెక్కిస్తుంటే
విరహతాపవేదనతో
కరిగిపోవు అమ్మణ్ణికి ॥
వేసవి
పగలట వెన్నెలరేయి
అగ్నిజ్వాలలట
చల్లటిగాలి
మల్లె
స్పర్శ గుండెల్లో ముల్లు గుచ్చుకుంటుంటే
గాజులు
వడ్డాణాలుగ మారిపోయిన చినదానికి ॥
No comments:
Post a Comment