చిగురాకును
కదిలించిన చిరుగాలినడిగాను
ఆమని
విరిపించిన సిరిమల్లినడిగాను
వెన్నెల
కురిపించిన జాబిల్లినడిగాను
తెలియదు
ఆచూకీ ఎవ్వరికీ
ఎట్లా
చేరాలి నీ దరికి ॥
దోచుకుపోయింది
నా నిదురను ఆ రేయి, ఎవరికి చెప్పాలి?
మల్లెల
వానైనా కలగదుగా హాయి, ఎట్లా బ్రతకాలి?
ఎంత
చల్ల నీరైనా తీర్చలేని దాహమిది
మంచి
గంధమైనా చల్లార్చలేని తాపమిది
రవికిరణం
కరిగించిన నీహారికనడిగాను
నింగి
ఒడిన నిదురించిన ఆ తారకనడిగాను
నెల
కోయిల వినిపించిన చిరుగీతిక నడిగాను ॥
పగలే
చీకటిగా అనిపిస్తున్నది, ఏమిటి ఈ మాయ?
ఎప్పుడు
నీ రూపే కనిపిస్తున్నది, రాదే నీకు దయ?
అలసిన
కన్నుల్లో తీరని నిరీక్షణ
ఊపిరి
సాగేందుకు నీవే ప్రేరణ
నెమలిని
మురిపించిన మేఘమాలనడిగాను
సిరులను
పండించిన పసిడినేలనడిగాను
తుమ్మెద
కరుణించిన జాజిపూలనడిగాను ॥
No comments:
Post a Comment