మనసు
మొక్క మౌనంగా మొగ్గ తొడిగినప్పుడు
ఆ
మధురమైన తొలి భావవిక్రియను
నువ్వెవరవు
అని నేనడగలేదు ॥
క్రమంగా
ఆ మొగ్గ పువ్వై విరిసినప్పుడు
మది
గదిలో రేగిన తీయని అనుభూతుల పరిమళం
తానెవరో
నాతో చెప్పలేదు
పరిణమించిన
పువ్వు పండయినప్పుడు
ఆకృతి
దాల్చిన ఆ ముగ్ధమనోహర రూపం
పేరేమిటో
నాకు తెలియరాలేదు
కానీ
ఆ పండును కోసి నీకు కానుకగా ఇవ్వాలని
అప్రయత్నంగా
అనిపించినప్పుడు మాత్రం ఉలికిపడ్డాను నేస్తమా,
నాలో
చిగురించినది స్నేహం కాదుకదా అని ॥
👏🏽👏🏽👏🏽
ReplyDelete