Wednesday, 28 June 2017

12. తనను చేరిన కవిత



నిదురవేళల స్మృతులు ఏవో పలకరించాయి
తలుపు తట్టిన తలపులేవో కలత రేపాయి

పెదవి దాటని మాటలేవో కలం జారాయి
చిలిపి కోయిల పాటలో పలికి కథలు చేరాయి
మనసు పెంచిన తోటల పూవులు తావులు రేగాయి
వయసు వాటిక బాటల తుమ్మెద పొందు కోరాయి

కనుల దాగిన కలల తీగలు చిగురు తొడిగాయి
విరుల రేకులు విరిసి తీయగ పరమిళించాయి
మమతలేవో ఎదల మాటున పురులు విప్పాయి
కవితలన్నీ కదిలి చాటుగ తనను చేరాయి

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...