కోయిల
వినిపించింది నీ సందేశం
శుభలేఖలు
పంచింది ఈ మధుమాసం ॥
అనురాగ
రాగాన పలికింది మానసవీణ
హృదయాల
తీరాన కురిసింది ఆశల వాన
విరిబాల
వేచింది తుమ్మెద కోసం ॥
చిరుగాలి
మైకాన పాడింది స్వాగతగీతం
చిగురాకు
అధరాన మోగింది వేణువు నాదం
ప్రణయాన
విరిసింది సుందరహాసం ॥
No comments:
Post a Comment