మానస
విహంగం తాకేను అంబరం
గగనమే
పరిధంది హృదయాన సంబరం
నూరేళ్ళ
బాటకై తోడు దొరికిన వేళ
నింగినే
చేరింది ప్రేమతో నేల ॥
నీ
పెదవిపై మెరయు చిరునవ్వు సిరిమల్లి
జీవన
పథాన సుమగంధాలు వెదజల్లి
నీ
నేస్తమై నిలిచి పోవాలి అండగా
ప్రతిదినం
కావాలి సరదాల పండగ ॥
మీ
వివాహానుబంధం ఓ మధురానందప్రబంధకావ్యమై రసభరితంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా
ఆకాంక్షిస్తూ-
No comments:
Post a Comment