విరబూసే
మల్లియగుండెల్లో
ఏ
ఊహలు రెప్పలు విచ్చాయో
దరి
చేరే తుమ్మెద కన్నుల్లో
ఏ
ఆశలు రెక్కలు విప్పాయో
చిరుగాలుల
కవ్వింతల్లో
చెలరేగే
తుళ్ళింతల్లో
గురి
చూసి పున్నమి వదిలే
వెన్నెల
బాణాలవానలో ॥
ఆమని
పూదోటల నిండింది
విరిచేడెల
మనసున పండింది
పరువం
నా తనువును నెమ్మదిగా
తన
కౌగిట బంధించేసింది
ఈ
నూతన అనుభూతుల్లో
రేకెత్తే
గిలిగింతలలో
ఏవేవో
మౌన స్వరాలను
ఎద
వేణువు పలికిస్తోంది
ఆ
పలుకుల తీయని నాదాల్లో
ఏ
రాగాలు రూపం పొందాయో
తొలి
వలపుల కమ్మని కావ్యాలై
ఏ
కవి లేఖినిలో పొంగాయో ॥
గోరువంక
చిలుకను తలచింది
నది
కన్నియ కడలిని వలచింది
నల్లని
ఆ మబ్బు పిలుపు విని
నెమలి
పదం జుమ్మని కదిలింది
రవి
స్పర్శకు కమలిని విరిసింది
నింగి
వలపు వానగ కురిసింది
ఈ
కలయిక వేడ్కల పర్వంలో
పరవశాన
ప్రకృతే మురిసింది
హృదయాల
మోహన వేణువుపై
ఏ
కోరిక తీగలు మీటిందో
ఎగిసి
పడ్డ ఏ భావపు కెరటం
మది
కోయిల పెదవిని దాటిందో ॥
No comments:
Post a Comment