ఎంత
దూరమో తెలియని పయనం - గమ్యం ఎరుగని ఒంటరి యానం
ఎదురు
చూపులకు అంకితం - ఇంతేనేమో జీవితం॥
వెలుగు
కరిగి చీకటి ఔతుంది - రేయి తరిగి ఉదయం తెస్తుంది
చీకటి
వెలుగుల ఈ దొంగాట - తుది మొదలెరుగని గమ్మతు పాట
ఎంతకు
తెగనిది ఈ పోరాటం - ఆశ ఊపిరుల చిర చెలగాటం
అర్థం కాదీ భాగోతం -
ఇంతేనేమో జీవితం॥
ఏదో
చేయాలని ఆరాటం - తీరని దిగులుకు తొలి సోపానం
నిరంతరం
సాగే అన్వేషణ - చివర మిగిల్చే అనంత వేదన
కారణమెరుగని
నిరీహ-వ్యథ ఇది - విముక్తి లేని బంధం కథ ఇది
పిచ్చి గీతల కాగితం -
ఇంతేనేమో జీవితం॥
రెక్కలు
తెగినది ఆశా విహగం - రమ్మని పిలిచే విశాల గగనం
ఎగరాలని
ఆకాంక్ష దహించే - ఎగరలేని ఖగమాక్రోశించే
విధి
దావాగ్నికి ఉనికి ఆహుతి - జీవితేచ్ఛకే పేర్చిన ఓ చితి
మేధస్సుకు ఊహాతీతం -
ఇంతేనేమో జీవితం॥
కనిపించే
దసలేదీ లేదట - ఉన్నది ఎపుడూ కనిపించనిదట
అంతుబట్టదీ
నిగూఢ తత్త్వం - అర్థం కాదు విరించి కవిత్వం
వీడేనా
ఈ విచిత్ర వ్యూహం - తీరేనా ఈ పిపాసి దాహం
అంతం
లేని విరహగీతం - ఇంతేనేమో జీవితం॥
అద్భుతం!
ReplyDelete