చిన్నారి
సిరిమల్లీ ఓ వెండి జాబిల్లీ
నా
మనసు ఊసులు కొన్ని మీతో చెప్పాలి ॥
చిలకమ్మ
రెక్కల తొడిగి చందమామ చెంతకు చేరి
కుందేలు
పిల్లతో కలసి ఆడుకోవాలని
ముణుకుమనే
చుక్కలన్నీ ఎంచక్కా కోసేసుకుని
నా
పట్టు పరికిణీపై కట్టుకోవాలని ॥
సరదాగా
మబ్బులపడవలో ఆకాశం సంద్రం దాచి
లోకాల
అంచులదాకా చేరిపోవాలి
బామ్మకథల
రాకుమారిలా అందమైన మేడ కట్టుకుని
హాయిగా
కలలే కంటూ ఉండిపోవాలి ॥
No comments:
Post a Comment