Wednesday, 28 June 2017

34. ఎందుకు చేశావో చెప్పు



నువ్వే కావాలంటూ అల్లరి చేసే మనసుకు
ఏం చెప్పాలో నువ్వే చెప్పు
ఏవో మాయలు చేసి గుండెల తలుపులు తోసి
ఎందుకు చొరబడ్డావో చెప్పు

తలలోకేమీ ఎక్కదు చదువుక ఎసరే వస్తుందేమో
విషయాలేవీ పట్టవు మెదడుకు మోసం తెస్తుందేమో
తిన్నది ఒంటికి పట్టదు, విన్నది చెవిలోకెక్కదు
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు
కన్నులు తెరిచే ఉన్నా, కనిపించదు ఎదురున్నా
చూపుల నిండా నువ్వున్నావు
ఎందుకిట్లా చేశావో చెప్పు

లోకం సోయే లేదు నువ్వే ప్రతి క్షణం వెంటుంటే
అదురే రేగిందబ్బా అంతా ఏదో వ్యాధిది అంటుంటే
ఎదలో రేగే దిగులు, మదిలో రేగే గుబులు,
అలజడులేవో రేపేస్తున్నావు
రాతిరి నిద్దుర లేక, పగలు పని కానీక
కలవరమేదో కలిగిస్తున్నావు
ఎందుకిలా చేశావో చెప్పు

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...