Wednesday, 28 June 2017

44. నీ రాక



నా ఇంట నీవు అడుగిడిన వేళ ఆ దీపమే చిన్నబోయింది
నీ చిన్ని నవ్వు సూరీడికన్న వేరెట్లు వెలుగులందించింది
నీ కాలి మువ్వ నా గడపతాకి ఘల్లనగనే మనసు పొంగింది
నీ రాక ఇంటిలోకా, ప్రణయలోకానికా అని భ్రమించింది

కలకానివేళ కదిలొచ్చినావు చిరకాల నిరీక్షిత స్వప్నమై
తొలిరాక నీది కుడికాలు మోపి మదినేలరావె మహరాణివై
చెలికాడి జంట వెయి నోములపంట ఎద నిండ రావె చిరు దీవెనై
ఈ ఇంట కాదు నా కంట నిలువు ఈ హృదయరాజ్య సామ్రాజ్ఞివై

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...