తలపుల
అల పరుగాడింది నీ తీరం కేసి
వలపుల
అల బంధించింది నను చేపను చేసి
అనురాగం
పువ్వును కోసి, కలల తావులను కలపోసి
నీకే
అర్పించా మదిని ఓ హృదయలోక వాసీ ॥
తుమ్మెద
పులకించింది సిరిమల్లిని చేరి
ఆమని
వికసించింది పూదోటగ మారి
ఒకనాటి
ఈ చిన్నారి, నేడు నీ రాకుమారి
నీ
రాకతో మారింది ఆమె బ్రతుకు దారి
సర్వస్వం
అర్పించింది జీవితాన్ని కోరి
మరిచిపోకు
ఈ నిరుపేదను ఓ బాటసారి ॥
నిదురరాని
నాపై రేయికి రాదు కదా జాలి
కలత
రేపి కవ్వించింది కసిగా చిరుగాలి
నువ్వు
నా కన్నుల వాలి, కమ్మని కలవై రావాలి
ఎన్నటికీ
వీడని తోడై అలా నిలచిపోవాలి
మరుభూమిని
తోటగ మార్చిన ఓ వనమాలి
ఈ
జన్మకు నా నేస్తంగా నువ్వే కావాలి ॥
No comments:
Post a Comment