Wednesday, 28 June 2017

31. నిన్నే చేరగా రానా



మదిలో తలపును నేనై, ఎదలో వలపును నేనై
నిన్నే చేరగ రానా ఓ నేస్తమా
విరిసే పువ్వును నేనై, నీ చిరునవ్వును నేనై
నీలో నిండగ రానా ఓ మిత్రమా

ఆమనివై నీవొస్తే కోయిల పాటనై పలుకనా
వేకువనై నీవొస్తే తొలిరవి కిరణాన్నై నే మెరియనా
ఆడే నెమలిని నేనై, నవ్వే కమలిని నేనై
పెదవిన పండగ రానా ఓ స్నేహమా

చినుకై నీవొస్తే కమ్మని పరిమళమై నే కదలనా
నదివై నీవొస్తే వేచే కడలిని నేనై నిలవనా
ఆ చిరుగాలిని నేనై, ఈ సిరిమల్లియ నేనై
నీ హృది కవితై రానా ఓ ప్రియతమా

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...