Wednesday, 28 June 2017

35. ఆశ



చిక్కనైన చీకటిలోనూ - వెచ్చనైన వెలుగుల కూర్చీ
కమ్మనైన కలలే కంటూ - గడిపేదే ఆశ
చిరుదీపపు కాంతి శిఖలో - తొలి సూర్యుని పొడుపును చూస్తూ
నడిరేయి చెర ముగిసేందుకు - వేచేదే ఆశ

తన కల కూడా కన్నుల తీరం దాటి తీరుతుందని
తన కథ కూడా కంచికి చేరే రోజు రాబోతుందని
నీరు కారిపోయే గుండెను ఉక్కు చేసుకుంటూ
ఓర్పు నావలో కాని రోజుల కడలి దాటుకుంటూ
          కెరటాల పోరాటాలను గెలిచేదే ఆశ

పెదవిన విరిసే చిరునవ్వులను చెరగనీయకుండా
మనసున నిలిచిన విశ్వాసాన్ని కరగనీయకుండా
గమ్యమెంతో దూరంలేదని గుర్తు చేసుకుంటూ
దిగులు వీడి దారి వెంబడే అడుగులేసుకుంటూ
          తుది ఎరగని జీవన పయనం చేసేదే ఆశ

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...